తన సినిమా విడుదలతేదిలో మార్పులేదని తెలిపిన ప్రముఖ దర్శకుడు

తన సినిమా విడుదలతేదిలో మార్పులేదని తెలిపిన ప్రముఖ దర్శకుడు

Published on Aug 6, 2013 11:30 PM IST

Harish-Shankar1
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు తారాస్థాయిలో ఉన్న నేపధ్యంలో భారీ సినిమాల విడుదల తేదీలు ప్రశ్నార్ధకంగా మారాయి. కానీ ఒక్క దర్శకుడు మాత్రం తన చిత్రం విడుదల తేదిపైచాలా నమ్మకంగా వున్నాడు. అతను మరెవరో కాదు, హరీష్ శంకర్

అతను ఎన్.టి.ఆర్ తో తెరకెక్కిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుందని మరోసారి స్పష్టం చేసాడు. అంతేకాక డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలపడంతో అభిమానులు ఆనందంగా వున్నారు

ఈ సినిమాలో సమంత హీరోయిన్. శృతి హాసన్ పాత్రలో కనిపిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత

సంబంధిత సమాచారం

తాజా వార్తలు