ఎన్.టి.ఆర్ రామయ్యా వస్తావయ్యాకి మొదలైన డబ్బింగ్

ఎన్.టి.ఆర్ రామయ్యా వస్తావయ్యాకి మొదలైన డబ్బింగ్

Published on Aug 6, 2013 9:00 PM IST

Ramayya-Vasthavayya
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా – మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. ప్రస్తుతం వాయిదా పడుతున్న సినిమాల దృష్ట్యా సెప్టెంబర్ 27న రావాల్సిన ఈ సినిమా కూడా వాయిదా పడుతుందేమో అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని, అనుకున్న సమయానికే వస్తుందని అలాగే మూవీకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.

ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాలో మాస్ ని ఆకట్టుకునే పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయని అందరూ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు