హైదరాబాద్ బాక్స్ ఆఫీసు వద్ద షారుఖ్ ఖాన్ కి పెద్ద అడ్వాంటేజ్

హైదరాబాద్ బాక్స్ ఆఫీసు వద్ద షారుఖ్ ఖాన్ కి పెద్ద అడ్వాంటేజ్

Published on Aug 6, 2013 5:16 PM IST

chennai-express

ఈ శుక్రవారం హైదరాబాద్ బాక్స్ ఆఫీసు వద్ద షారుఖ్ ఖాన్ కి పెద్ద అడ్వాంటేజ్ కానుంది. ఈ శుక్రవారం పెద్ద తెలుగు సినిమాలు ఏమీ లేకపోవడం, అలాగే ఆగష్టు 9న రంజాన్ కి సెలవు రావడంతో షారుఖ్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ మూవీని భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రోహిత్ శెట్టి డైరెక్టర్. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమాపై షారుఖ్ ఖాన్ పై బాగానే ఆశలు పెట్టుకున్నాడు. షారుఖ్ బ్లాక్ బస్టర్ అందుకొని కొంత కాలం అయ్యింది, ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తో మళ్ళీ తన సత్తా చాటుకుంటాడని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజాకీయ సంక్షోభం కూడా చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు