విపరీతంగా ఆకట్టుకుంటున్న పవన్ కాటమ రాయుడ సాంగ్

విపరీతంగా ఆకట్టుకుంటున్న పవన్ కాటమ రాయుడ సాంగ్

Published on Aug 5, 2013 12:27 PM IST

Pawans_Kaatam_Raayuda_Song (17)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలపించిన ‘కాటమ రాయుడ’ సాంగ్ ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఈ సాంగ్ కి మంచి పాపులారిటీ వచ్చింది. యుట్యూబ్ లో కేవలం 24 గంటల్లో 3,70,000 మంది ఈ వీడియోని చూసారు. ఒక్క సాంగ్ విషయంలోనే కాకుండా పాటలో పవన్ జోష్ మరియు డిఫరెంట్ స్టైల్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. ఈ సాంగ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’, ‘తొలిప్రేమ’ రోజుల్ని గుర్తుకు తెస్తున్నాయి.

ఈ శుక్రవారం రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో అదిరిపోయే ట్రేడ్ మార్క్ డైలాగ్స్ తో పాటు సూపర్బ్ కామెడీ ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మొవిఎకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.


కాటమ రాయుడ సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు