యంగ్ హీరో నితిన్, పంచ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి త్వరలోనే నటించనున్నాడు. ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరునుండి పూర్తిస్థాయి షూటింగ్ మొదలుకానుంది
ఈ సినిమాకు పూరియే నిర్మాత. ‘హార్ట్ అటాక్’ అన్నది ప్రస్తుతం అనుకున్న టైటిల్. ఒక కొత్త హీరోయిన్ ను ఈ సినిమాకోసం తీసుకునే పనిలోవున్నారు. ఇంకా ఏ ప్రకటన అధికారికంగా వెలువడలేదు
నితిన్ ప్రస్తుతం కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అదిరిపోయే ఫామ్ లో ఉన్నాడు. ఈ సినిమాను నితిన్ మరియు పూరి చాలా సీరియస్ గా తీస్కుంటున్నారు