ఫన్నీ బన్నీతో రొమాంటిక్ ఎంటర్టైనర్ తియ్యబోతున్న హరీష్ శంకర్

ఫన్నీ బన్నీతో రొమాంటిక్ ఎంటర్టైనర్ తియ్యబోతున్న హరీష్ శంకర్

Published on Aug 3, 2013 11:10 AM IST

allu-arjun-and-harish-shank

మాస్ పల్స్ ను పక్కగా ఒడిసిపట్టిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. తన సినిమాలో పంచ్ డైలాగులతో, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో ఫ్యాన్స్ ను తృప్తిపరిచి తన ఖాతాలో విజయాన్ని సొంతంచేసుకోగలడు. ప్రస్తుతం హరీష్ శంకర్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా తెరకెక్కించడంలో బిజీగా వున్నాడు.

ఈ ప్రాజెక్ట్ తరువాత హరీష్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి సినిమా చెయ్యనున్నాడు. ఈ సినిమా యాక్షన్ అంశాలను మేళవించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. కధనాల ప్రకారం చాలా వరకూ డైలాగుల పార్ట్ కుడా ముగిసిందట

ఈ సినిమాకు దానయ్య నిర్మాత. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది

తాజా వార్తలు