పవన్ అత్తారింటికి దారేదికి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్

పవన్ అత్తారింటికి దారేదికి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్

Published on Aug 2, 2013 7:40 PM IST

Attarintiki-Daredi-Posters-
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగష్టు 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తయ్యాయి. ఈ సినిమాకి సెన్సార్ వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. దీన్ని బట్టి అత్తారింటికి దారేది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ అని అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారి సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బొమన్ ఇరానీ, నదియా, బ్రహ్మానందం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం ని టీజ్ చేస్తూ పాడే ఓ పాటని కూడా రికార్డ్ చేసారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. పవర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

తాజా వార్తలు