40 ఏండ్ల క్రీతం తీసిన సినిమాని తండ్రి మీద ప్రేమతో విడుదలచేసిన కొడుకులు

40 ఏండ్ల క్రీతం తీసిన సినిమాని తండ్రి మీద ప్రేమతో విడుదలచేసిన కొడుకులు

Published on Aug 2, 2013 8:20 AM IST

love-in-bombay

మనం మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం. వారి కోసం ఏం చేయ్యడానికైన వెనుకాడం. కానీ ఆ పనులను మనం ఎంత వరకు సంతోషంగా చేస్తున్నాం? మన మనసును కదిలించే అలాంటి కథ ఒకటి. ఈ రోజు దాని గురించి చూద్దాం. ఒక సినిమాని 1973లో నిర్మించడం జరిగింది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు. ఈ సినిమా చివరికి ఈ రోజు ఇండియా అంతటా విడుదలకానుంది. 40 సంవత్సరాల తరువాత.! ఆ సినిమా ఏదంటే ‘లవ్ ఇన్ బొంబాయి’. ఇద్దరు కొడుకులు తన తండ్రి కోసం, అతని కోరికను తీర్చడానికి ఈ సినిమా విడుదల చేయడానికి పరిస్థితులతో ఫైట్ చేశారు.

గతకాలం అందరికి తెలిసిన నటుడు జాయ్ ముఖర్జీ ఈ సినిమాని 1973లో దర్శకత్వం వహించాడు. దాదాపు రూ. 35 నుండి రూ. 40 లక్షల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇప్పటి మనీ తో పోల్చుకుంటే దాదాపు రూ. 300కోట్ల ఉంటుందన్న మాట. నటి వహీదా రెహ్మాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఒక షిప్ లో జరిగే లవ్ స్టోరీ. ఈ షిప్ ఒక తుఫాన్ కి బోల్తా పడుతుంది. హీరో తన లవ్ చేసిన అమ్మాయిని, ప్రజలని ఈ ప్రమాదం నుండి కాపాడుతాడు.

ఈ సినిమాని నిర్మిస్తున్న సమయంలో జాయ్ ముఖర్జీ ఆర్ధిక పరిస్థితి దెబ్బతింది. ఈ సినిమాని విడుదల చేయడానికి అతని వద్ద డబ్బులు లేవు. దానితో ఈ సినిమా మూలనపడిపోయింది. గత నాలుగు దశబ్దాలుగా ఈ సినిమాని స్టోర్ చేసిన దగ్గర నుండి తీయడం శుభ్రం చేయడం, మళ్ళి అక్కడే పెట్టడం జరుగుతోంది. తన కుటుంబీకులు ఎప్పటికైనా ఈ సినిమాని విడుదలచేస్తారని ఆయన చెప్తూ వుండే వాడు.

గత సంవత్సరం జాయ్ ముఖర్జీ మరణించడం జరిగింది. అతని కొడుకులు వారి తండ్రి జీవితాంతం కన్నా కల, ఆశయం ఆ సినిమాని థియేటర్స్ లో విడుదల చేయడం అని తెలుసుకున్నారు. దానితో ఈ సినిమాని మూలగది నుండి తీసుకోని శుభ్రం చేసి కొంత ఆధునీకరించి విడుదలకు సిద్దంచేయడం జరిగింది. ఈ రోజు ఈ సినిమాని కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

మీరు గనక పాతకాలపు గ్రేటెస్ట్ నటులను బిగ్ స్క్రీన్ పై చూడాలనుకుంటే ‘లవ్ ఇన్ బొంబాయి’ సినిమాని మిస్ కాకండి. దాని విడుదల వెనుక చాలా ప్రేమ దాగివుంది.

తాజా వార్తలు