చిట్ చాట్ : మానస – ‘రొమాన్స్’ మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

చిట్ చాట్ : మానస – ‘రొమాన్స్’ మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

Published on Aug 2, 2013 1:40 AM IST

Manasa
రేపు భారీగా విడుదల కానున్న ‘రొమాన్స్’ సినిమాతో మానస తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమవుతోంది. మానస ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకుంది. ఆమె స్వతహాగా విజయవాడకి చెందిన తెలుగమ్మాయి, కానీ ఆమె చెన్నైలో పెరిగింది. మానస తను చదువుతున్న మెడిసిన్ ఆపేసి హీరోయిన్ గా మారింది. మానస ఏమి చెప్పిందో ఇప్పుడు చూద్దాం..

ప్రశ్న) ముందుగా మీ గురించి కాస్త వివరంగా చెప్పండి..

స) నేను విజయవాడలో పుట్టాను కానీ చెన్నైలోనే పెరిగాను. నా స్కూల్ డేస్ అన్నీ చెన్నైలోనే గడిచాయి, మెడిసిన్ చెయ్యడం కోసం మళ్ళీ విజయవాడకి వచ్చాను. కానీ నేను రెండు నెలలకి దాన్ని ఆపేసి,ఓ రియాలిటీ షో ఆడిషన్స్ కి వెళ్లాను. అక్కడ నాకు కాస్త గుర్తింపు వచ్చి కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. నేను పూరి గారు తీసిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఓ చిన్న పాత్ర చేసాను. ఆ తర్వాత నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం మంచి బ్యానర్ కోసం ఎదురు చూసాను. అందరికీ రీచ్ అయిపోయిన బ్యానర్ నుండి నేను పరిచయం అవుతుండడం చాలా ఆనందంగా ఉంది.

ప్రశ్న) మీరు యాక్టింగ్ కోసం మెడిసిన్ వదులుకున్నారు. యాక్టింగ్ అనేది మీ చిన్ననాటి కలా?

స) నాకు మెడిసిన్ చెయ్యాలని ఉండేది. అలాగే యాక్టింగ్ అంటే కూడా కాస్త మక్కువ ఉండేది. కానీ మా ఫ్యామిలీకి ఎలాంటి కనెక్షన్స్ లేకపోవడం వల్ల నాకు ఎలాంటి ఆశలు లేవు. కానీ నేను ఒక్కసారి రియాలిటీ షో ఆడిషన్స్ కి హాజరు కాగానే పరిస్థితులు వాటంతట అవే మారిపోయాయి. ఆ తర్వాత నేను మా పేరెంట్స్ ని ఒప్పించాను. వాళ్ళు కాస్త ఆందోళన చెందే తత్త్వం ఉన్నవారు అలాగే మన ఫ్యామిలీ నుంచి ఎవరికి సినిమాల్లో సంబంధం లేదని కాస్త నిరుత్సాహానికి గురిచేసారు. కానీ ఒక సినిమా అన్నా చెయ్యాలి అని ఒక సంవత్సరం టైం కావాలని తీసుకున్నాను.

ప్రశ్న) మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది?

స) నా ఫోటోలు చూసి మారుతి గారు ఆడిషన్ కి పిలిచారు. ఆయనకి నా పెర్ఫార్మన్స్ నచ్చింది అలాగే బాగా రెబల్ గా ఉండే యంగ్ గర్ల్ పాత్రకి నేను పర్ఫెక్ట్ గా సరిపోతానని భావించారు. అలా నేను ఈ సినిమాలో అవకాశాన్ని అందుకున్నాను.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో నేను ప్రిన్స్ లవ్ చెయ్యాలని వెంటపడే అమ్మాయి పాత్ర పోషించాను. బాగా రెబల్ గా, కాస్త హార్డ్ గా ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. హీరో నన్ను ఆకట్టుకోవడానికి చాలా పనులు చేస్తాడు, ఆ తర్వాత మేము ఒకటవుతాము కానీ అతను వేరే అమ్మాయి కోసం నాకు హ్యాండ్ ఇస్తాడు. దాంతో హీరో పై రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి హీరోకి పలు ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటాను.

ప్రశ్న) హీరోయిన్ అయిన తర్వాత మీ బిహేవియర్ లో ఏమన్నా మార్పులు వచ్చాయా? అలాగే మీరు ఇండస్ట్రీలో అనుకున్నదానికి, మీరు చూసిన దానికి ఏమన్నా తేడాలు కనపడ్డాయా?

స) అన్నిటికంటే హీరో, హీరోయిన్ తమ పనికోసం చేసే హార్డ్ వర్క్ చూసి షాక్ అయ్యాను. నేను ఇండస్ట్రీకి రాకముందు హీరోయిన్స్ కేవలం మేకప్ వేసుకొని అందంగా కనిపిస్తే చాలు అనుకునే దాన్ని, కానీ ఈ ప్రొఫెషన్ లో ఎంతో ఇన్వాల్వ్ మెంట్ ఉంది. అది నన్ను షాక్ కి గురి చేసింది.

ప్రశ్న) రొమాన్స్ సినిమాలో అడల్ట్ కామెడీ ఉండేలా ఉంది. మీరు షూటింగ్ చేసేటప్పుడు ఏమన్నా కాస్త ఇబ్బందిపడిన సీన్స్ ఉన్నాయా?

స) లేదు, నేను బాగా ఎంజాయ్ చేసాను. ఇది ఒక కాలేజ్ చుట్టూ తిరిగే ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ‘ కాలేజ్ లో జరిగేవే మేము చూపించాము’. నా పాత్రలో చెడుగా చెప్పుకునేలా ఉండదు. ఆ విషయంలో నేను హ్యాపీ.

ప్రశ్న) యాక్టింగ్ కాకుండా మీరు బాగా ఎంజాయ్ చేసే అంశాలేమిటి?

స) ప్రస్తుతం నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నాను. నేను ఒక డాన్సర్, ఎరోబిక్స్ చెయ్యడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు ఫుడ్ అంటే కూడా ఇష్టం కానీ ఈ ఫీల్డ్ లో ఫిట్ గా ఉండాలని నాకు నేనుగా కంట్రోల్ చేసుకుంటున్నాను. అలాగే చాలా బుక్స్ చదువుతుంటాను మరియు ఎక్కువగా సినిమాలు చూస్తుంటాను.

ప్రశ్న) మీరు ఏమన్నా కొత్త సినిమాలకు సైన్ చేసారా?

స) నేను కొత్త సినిమాలకి సైన్ పెట్టె ముందు ఈ సినిమాలో నా పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారా అనేది చూడాలి. ఆ ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత కొత్త ఆఫర్స్ చూస్తాను. నేను ఇండస్ట్రీలో ఒక పార్ట్ అవ్వాలని అనుకుంటున్నాను, ప్రేక్షకులు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

అంతటితో మానసతో మా చిట్ చాట్ ని ముగించాము. ఈ చిట్ చాట్ మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాం..

తాజా వార్తలు