నాగార్జున నటించిన రాజన్న 4 రోజుల కలెక్షన్స్

నాగార్జున నటించిన రాజన్న 4 రోజుల కలెక్షన్స్

Published on Dec 26, 2011 2:35 PM IST


కింగ్ అక్కినేని రాజన్నకి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుతున్నారు. ఏనీ మరియు నాగార్జునల అధ్బుత నటనకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. రాజన్న చిత్రాన్ని చూసిన వారు ఈ చిత్రం చాలా బావుందని చెప్తున్నారు. ఈ చిత్రం విడుదలైన ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు మాకు లభించాయి. మొదటి మూడు రోజులకు గాను ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపుగా 7కోట్ల 71 లక్షల రూపాయలు షేర్ వసూలు చేసింది. ఈ చిత్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు విడుదల చేసారు.

వారు దాదాపుగా 18 కోట్ల రూపాయలు రూపాయలకు ఆంధ్ర ప్రదేశ్ హక్కులు కొనుగోలు చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. విదేశాలో మాత్రం నాగార్జున గారే స్వయంగా విడుదల చేసారు. కీరవాణి గారు అందించిన అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏనీ, నాగార్జునల అధ్బుత నటన సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు