బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ సమాజ శ్రేయస్సు కోసం మొదలు పెట్టిన మార్డ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నాడని కొన్ని నెలలకు ముందు తెలిపారు. రేప్ మరియు స్త్రీల పట్ల వివక్షతకు పురుషులు వ్యతిరేకంగా ఉండాలని మార్డ్ సంస్థని మొదలు పెట్టారు. మొదటి సారిగా మహేష్ బాబు మార్డ్ షర్టు ధరించిన ఫోటో బయటకు వచ్చింది. త్వరలో మహేష్ బాబు వాయిస్ తో ఓ ప్రత్యేక గీతం కూడా విడుదలకానుంది. ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ ఈ గీతాన్ని రాయడం జరిగింది. ఈ గీతం తెలుగు వెర్షన్ కి మహేష్ బాబు వాయిస్ అందించనున్నాడు.
మహేష్ బాబు, ఫర్హాన్ అక్తర్ సమాజం కోసం చాలా మంచి పని చేస్తున్నారు.