దేవీశ్రీ ఫ్యామిలీ పాట విషయంలో హ్యాపీగా ఉన్న బాలయ్య

దేవీశ్రీ ఫ్యామిలీ పాట విషయంలో హ్యాపీగా ఉన్న బాలయ్య

Published on Jul 29, 2013 1:34 PM IST

DSP-and-NBK
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది, ఈ సినిమా పొలిటికల్ ఎలిమెంట్స్ ఉంటాయని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కెరీర్లో మొదటి సారి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ బాలకృష్ణ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ విషయం సినిమా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దేవీశ్రీ ఈ సినిమా కోసం ఓ ఫ్యామిలీ పాటని కంపోజ్ చేసారు, ఆ పాట విషయంలో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చాలా హ్యాపీగా ఉందని సమాచారం. ఈ పాట బాలకృష్ణకి కూడా బాగా నచ్చిందని సమాచారం. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక హీరోయిన్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది. 2014లో ఈ సినిమాని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు