చివరి దశలో ఉన్న అత్తారింటికి దారేది పోస్ట్ ప్రొడక్షన్

చివరి దశలో ఉన్న అత్తారింటికి దారేది పోస్ట్ ప్రొడక్షన్

Published on Jul 29, 2013 8:42 AM IST

Atharintiki-Dharedhi-(10)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 7న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – సమంత జంటగా కనిపించనున్నారు. ప్రణిత సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా పై మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో క్రేజ్ మరియు అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా రైట్స్ అన్ని ఎరియాల్లోనూ మంచి అమౌంట్ కి అమ్ముడు పోయాయి. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో విలక్షణ నటులైన కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బొమన్ ఇరానీ, నదియాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు