రాత్రంతా డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్

రాత్రంతా డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్

Published on Jul 28, 2013 2:15 PM IST

Pawan_Kalyan_in_Atharintiki_Dharedhi (5)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాగా క్లాస్ లుక్ లో కనిపించనున్న సినిమా ‘అత్తారింటికి దారేది’. ఆగష్టు 7న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రాత్రి వేళల్లో కంటిన్యూగా డబ్బింగ్ చెబుతున్నారు. ఆయన నిన్న రాత్రంతా, అలాగే ఈ రోజు ఉదయం కూడా కొద్దిసేపు డబ్బింగ్ చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చినందుకు పవన్ కళ్యాణ్ సంతోషంగా ఉన్నట్లు సమాచారం.

ఈ సినిమాలో మొదటి సారి పవన్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. సెకండ్ హీరోయిన్ గా ప్రణిత నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, మిర్చి ఫేం నదియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో పవన్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకి నిర్మాత.

తాజా వార్తలు