ఆయనే నన్ను హీరోని చేసాడు – రవితేజ

ఆయనే నన్ను హీరోని చేసాడు – రవితేజ

Published on Jul 28, 2013 12:40 PM IST

Raviteja
హీరోగా కెరీర్ మొదలు పెట్టిన అనతి కాలంలోనే మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకొని మాస్ మహారాజగా రవితేజ పేరు తెచ్చుకున్నాడు. రవితేజ ఇండస్ట్రీలోకి రాగానే అతనికి హీరోగా పట్టం కట్టి స్వాగతించలేదు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని హీరోగా తనకి ఎవరు అవకాశాలు ఇవ్వలేదని అసిస్టెంట్ డైరెక్టర్ గా అవతారం ఎత్తి ఆ తర్వాత హీరోగా అవకాశాలు అందిపుచ్చుకొని ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని హీరో అయ్యాడు. ఇంతకీ అసిస్టెంట్ గా ఉన్న రవితేజని హీరోగా ఎవరు పరిచయం చేసారా అనే విషయం రవితేజని అడిగితే ‘ నిన్నేపెళ్ళాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైములో నన్ను చూసి నాలోని టాలెంట్ ని గుర్తించిన కృష్ణ వంశీ చాన్స్ ఇచ్చాడు. ఆయన నన్ను సింధూరం సినిమాకి ఎంపిక చేసినప్పుడు ఇతను హీరో పాత్రకి పనికొస్తాడా అని అందరూ అన్నారు. కానీ వంశీ నాతో ఫోటో షూట్ చేసారు. దాని తర్వాత ఎవరు చెప్పినా వినకుండా నా చేతే చంటి పాత్ర చేయించారు. సినిమా పెద్దగా ఆడకపోయినా నాకు మంచి పేరు లభించింది. ఆతర్వాత నేను హీరోగా చేసిన నీ కోసం, ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం సినిమాలు నన్ను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా చేశాయని’ రవితేజ తెలిపాడు.

తాజా వార్తలు