అందాల రాక్షసి దర్శకుడితో కలవనున్న రానా

అందాల రాక్షసి దర్శకుడితో కలవనున్న రానా

Published on Jul 12, 2013 12:30 PM IST

Rana-and-Hanu
దగ్గుబాటి రానా ప్రస్తుతం చాలా బిజీగా వున్నాడు. అజిత్ నటిస్తున్న ఒక తమిళ చిత్రంలో తన పాత్ర షూటింగ్ ను పూర్తిచేసుకున్న రానా ప్రస్తుతం తెలుగులో ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ వంటి రెండు పెద్ద సినిమాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ భారీ బడ్జెట్ సినిమాలు కావడం ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమా గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకోవడంరానాకు కలిసొచ్చే అంశం. ఇప్పుడు రానా మరొక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. ‘అందాల రాక్షసి’ సినిమాను తీసిన హను రాఘవపుడి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తీయనున్నారు. సమాచారం ప్రకారం ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిస్తారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాలో మిగిలిన తారాగణాన్ని ప్రకటించాల్సివుంది. త్వరలోనే ఈ వివరాలు తెలుపుతారు. ఈ చిత్రమే కాకుండా రానా సెల్వరాఘవన్ దర్శకత్వంలో మరో ద్విభాషా చిత్రాన్ని కూడా అంగీకరించాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు