మిలాన్ లో షూటింగ్ ముగించుకున్న శృతి హాసన్

మిలాన్ లో షూటింగ్ ముగించుకున్న శృతి హాసన్

Published on Jul 11, 2013 10:00 PM IST

shruti-haasan
‘రేస్ గుర్రం’ సినిమా కోసం యూరోప్ వెళ్ళిన శృతి హాసన్ అక్కడ రెండు పాటల చిత్రీకరణను ముగించుకుంది. తన కెరీర్ లో మొదటిసారిగా అల్లు అర్జున్ తో జత కట్టనుంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ మధ్యే రెండు పాటలను జెనివా మరియు మిలాన్ ప్రాంతాలలో అద్బుతమైన లోకేషన్లలో తీసారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, శృతి హాసన్ లుక్ విభిన్నంగా ఉండనుంది. వీరిని కొత్తగా చూపించడానికి కాస్ట్యూమ్స్ బృందం చాలా కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా శృతికి ఈ షెడ్యూల్ బాగా నచ్చేసిందట. తాను తప్పక చూడాలనుకున్న ప్రదేశాలలో ఇది ఒకటని తెలిపింది. ఇదిలావుంటే తన భార్య స్నేహతో వచ్చిన అల్లు అర్జున్ మిలాన్ అందాలను ఆస్వాదించడంలో బిజీగా వున్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు