సాహసంకి స్పెషల్ అట్రాక్షన్ కానున్న సినిమాటోగ్రఫీ

సాహసంకి స్పెషల్ అట్రాక్షన్ కానున్న సినిమాటోగ్రఫీ

Published on Jul 11, 2013 6:53 PM IST

Sahasam-(6)

మాచో హీరో గోపీచంద్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వస్తున్న అడ్వెంచర్ సినిమా ‘సాహసం’. ఈ సినిమా గ్రాండ్ గా ఈ నెల 12న విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా బాగుంటుందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా చాలా గ్రాండ్ గా ఉంటుందని భావిస్తున్నారు. శ్యాం దత్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్, ఇప్పటికే ఆయనకి మంచి పేరొచ్చింది. అలాగే గోపీచంద్, చంద్రశేఖర్ యేలేటి కూడా అతను అధ్బుతమైన సినిమాటోగ్రఫీ అందించారని తెలిపాడు. ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని లడఖ్ లో షూట్ చేసారు, అలాగే సినిమాటోగ్రాఫర్ ఆ ప్రాంతాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు. తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు