అధికారికంగా ప్రకటించిన పవన్ సినిమా టైటిల్

అధికారికంగా ప్రకటించిన పవన్ సినిమా టైటిల్

Published on Jul 10, 2013 3:10 PM IST

Pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా టైటిల్ ని ‘అత్తారింటికి దారేది’ గా అధికారికంగా ప్రకటించడం జరిగింది. కొద్ది రోజుల ముందు నుండి ఈ టైటిల్ రోమర్స్ అనడం జరిగింది. కానీ చివరిగా ఈ టైటిల్ నే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమా ఆగష్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మంచి కామెడీతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు