జూలై 19న అత్తారింటికి దారేది సినిమా ఆడియో లాంచ్ ?

జూలై 19న అత్తారింటికి దారేది సినిమా ఆడియో లాంచ్ ?

Published on Jul 9, 2013 5:50 PM IST

pawan-kalyan-trivikram
ఈ ఏడాదిలో విడుదలకానున్న సినిమాలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాటిల్లో ‘అత్తారింటికి దారేది’ సినిమా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సమంత మరియు ప్రణీత సుభాష్ లు ప్రధాన పాత్రధారులు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. గతకొన్ని రోజులుగా పవన్ కళ్యాన్ తో కలిసి సమంత, ప్రణీత, హంసనందిని మరియు ముంతాజ్ లు ఒక పార్టీ సాంగ్ షూటింగ్ లో బిజీగా వున్నారు. తాజా సమాచారం ప్రకారం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ సినిమా ఆడియో జూలై 19న విడుదలకావచ్చు. అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడిస్తారు. కుటుంబ సంబంధాల నేపద్యంలో ఎంటర్టైనింగ్ గా సాగే సినిమా. నదియా మరియు బోమన్ ఇరాని ముఖ్య పాత్రలను పోషించారు. గతనెలలో యూరోప్ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ ఎపిసోడ్ లను తీసారు . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం ఆగష్టులో విడుదలకానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు