మంచి అంచనాల నడుమ విడుదలకానున్న సాహసం

మంచి అంచనాల నడుమ విడుదలకానున్న సాహసం

Published on Jul 8, 2013 11:30 PM IST

Sahasam-(1)
చంద్రశేఖర్ యేలేటి తాజా చిత్రం ‘సాహసం’ జూలై 12న మనముందుకు రావడానికి సిద్దంగావుంది. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదాపడ్డా దీనిపై ఉన్న అంచనాలు మాత్రం భారీగానేవున్నాయి. ఈ సినిమా ట్రైలర్, గోపిచంద్ నటన ఈ సినిమాపై ఆసక్తిని నెలకొలిపాయి. అంతేకాక ఈ మధ్య కాలంలో యాక్షన్ అడ్వెంచర్ సినిమాలు రాకపోవడం ఈ సినిమాపై అంచానాలు పెరగడానికి మరోకారణం. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకుంటుంది క్లైమాక్స్ గురించి. ఇందులో గ్రాఫిక్స్ కు పెద్దపీట వేసారు. ఇప్పటిదాకా ప్రతీ విషయాన్నీ దర్శకుడు రహస్యంగా వుంచినా లడఖ్ లో తీసిన వీడియో బయటకొచ్చేసరికి అందరి అంచనాలు పెరగాయి. ఈ సినిమాలో గోపీచంద్ తాప్సీ హీరో హీరోయిన్స్. శక్తి కపూర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. శ్రీ సంగీతం అందించాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు