పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా దాదాపు పుర్తికావచ్చింది. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోస్ లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా బృందం నుండి అందిన సమాచారం ప్రకారం ఈ పాట సినిమాకే హై లైట్ గా నిలవనుందట. ముఖ్యంగా పవన్ స్టెప్పులు దేవి మ్యూజిక్ అద్భుతంగా వున్నాయట. పార్టీ నేపధ్యంలో సాగనున్న ఈ పాటలో హంసనందినిమరియు ముంతాజ్ మెరవనున్నారు. సమంత, ప్రణీత సుభాష్ లే కాక ‘ఖుషి’ తరువాత మరోసారి పవన్ సరసన ముంతాజ్ కనిపిస్తుంది
సమాచారం ప్రకారం ఈ పాటను షూటింగ్ స్పాట్ లో తిలకించడానికి చాలా మంది నటులు, నిర్మాతలు సైతం వస్తున్నారట. ఈ పాటకు గణేష్ మాస్టర్ నృత్యభంగిమలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే పవన్ కాంబినేషన్ లో దేవి అందించిన ‘గబ్బర్ సింగ్’, ‘జల్సా’ ఆల్బంలు ఘనవిజయం సాధించాయి. ‘అత్తారింటికి దారేది’ చిత్రం కూడా అదే బాటలో వెళ్లనుందని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా ఆగష్టు మొదటివారంలో విడుదలకానుంది.