చివరి దశలో రామ్ చరణ్ ఎవడు

చివరి దశలో రామ్ చరణ్ ఎవడు

Published on Jul 7, 2013 9:05 PM IST

yevadu-audio-review
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా షూటింగ్ ఒక్క పాట మినహా మిగతా అంతా దాదాపు పూర్తయ్యింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా ఆడిపాడుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఫ్రీడం’ అనే పాటని రామ్ చరణ్ పై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్న ఈ పాటలో చరణ్ తన డాన్సులతో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటాడని ఆశిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ చిత్ర ఆడియో ఆల్బమ్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాని జూలై 25న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు