ఆగడు పై వస్తున్న పుకార్లకు శ్రీను వైట్ల సమాధానం

ఆగడు పై వస్తున్న పుకార్లకు శ్రీను వైట్ల సమాధానం

Published on Jul 6, 2013 11:46 AM IST

Mahesh-Srinu-Vaitla
శ్రీను వైట్ల తన గత చిత్రం విడుదలై మూడు నెలలు కాకుండానే మహేష్ బాబు , తమన్నాలతో ‘ఆగడు’ సినిమాను ప్రకటించేసాడు. గత కొన్నిరోజులుగా ఈ సినిమాకు దూకుడే దూకుడు అన్న ట్యాగ్ లైన్ ప్రచారంలో వుంది. ఈ విషయంపై చాలా మంది అభిమానులు శ్రీనువైట్లను ప్రశ్నించగా చివరికి ఆయన ఈ విధంగా ట్వీట్ చేసారు “అందరికీ శుభోదయం.. మీ అందరి ట్వీట్లు చూసాను. ప్రస్తుతానికి మహేష్ చిత్రానికి ‘ఆగడు’ అనే టైటిల్ ను మాత్రమే ఖరారు చేశాం. దూకుడే దూకుడు అన్నది ఈ సినిమా ట్యాగ్ లైన్ కాదు” అని తెలిపారు. ‘దూకుడు’ వంటి భారీ విజయం తరువాత మహేష్ తో శ్రీను వైట్ల రెండోసారి జతకట్టనున్నాడు. ఈ సినిమా ఆగష్టు నుండి ప్రారంభంకావచ్చు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తారు. థమన్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు