బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘పోటుగాడు’

బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘పోటుగాడు’

Published on Jul 2, 2013 1:30 AM IST

Potugadu
మంచు మనోజ్ చిత్రం ‘పోటుగాడు’ ప్రధాన షూటింగ్ పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం మనోజ్ పై ఓ పాట చిత్రీకరించడానికి బ్యాంకాక్ లో వుంది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు సిమ్రాన్ కౌర్ ముండి ,అను ప్రియ, రాచెల్, సాక్షి చౌదరి వున్నారు . పవన్ వాడేయార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష మరియు శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “మనోజ్ పాత్ర చిత్రీకరణ ఈ సినిమాకే ఆకర్షణగా నిలుస్తుంది. ఒక అబ్బాయి, నలుగురు అమ్మాయిల నడుమ సాగే రొమాంటిక్, కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని, మనోజ్ పాడిన ‘ప్యార్ మే పడిపోయా’ పాత చాలా విభిన్నంగా ఉండనుందని”తెలిపాడు. ఈ సినీమా ఆడియో జూలైలో విడుదలయ్యి, ఆగష్టులో మన ముందుకురానుంది.

తాజా వార్తలు