బొద్దుగా కనిపించనున్న అల్లరి నరేష్

బొద్దుగా కనిపించనున్న అల్లరి నరేష్

Published on Jul 1, 2013 11:22 AM IST

Allari-Naresh

కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన రాబోయే సినిమాలో ఎన్నడూ కనిపించని ఓ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. డైరెక్టర్ రవిబాబుతో కలిసి చేస్తున్న సినిమాకి ‘లడ్డూ బాయ్’ అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీలో నరేష్ బాగా లావుగా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తనని తానూ మార్చుకుంటున్నాడు. నరేష్ ని లావుగా తయారు చేయడం కోసం లండన్ కి చెందిన కృత్రిమ మేకప్ టెక్నీషియన్ పనిచేస్తున్నాడు. ఇటీవలే నరేష్ లండన్ వెళ్లి మేకప్ టెస్ట్ లు కూడా చేసుకొని వచ్చారు.

లడ్డూ బాయ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. చిన్న చిన్న సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బాగా పరిచయమున్న రైటర్ త్రిపురనేని మహారధి కుమారుడు రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నాడు. చాలా సన్నగా పొడవుగా ఉండే అల్లరి నరేష్ ని బాగా లావుగా ఉన్న బాయ్ లా ఎలా చూపిస్తారనే విషయం అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది.

తాజా వార్తలు