త్వరలో రానున్న బంగారు కోడిపెట్ట ఆడియో

త్వరలో రానున్న బంగారు కోడిపెట్ట ఆడియో

Published on Jun 30, 2013 8:15 PM IST

Bangaru-Kodi-Petta-Movie-La
యంగ్ హీరో నవదీప్, స్వాతి జంటగా నటిస్తున్న ‘బంగారు కోడిపెట్ట’ సినిమా జూలై సెకండాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ పిప్పళ్ళ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాని గురు ఫిల్మ్స్ బ్యానర్ పై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఒక వ్యక్తి తన కలల్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నించే ఒక వ్యక్తి చుట్టూ ఈ కథ నడుస్తుంది. నవదీప్ అనుకోకుండా స్వాతిని కలవడం, దాంతో అనుకోకుండా అతని లైఫ్ లో ఓ చేంజ్ వస్తుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ఆడియో ప్రోమోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ఆడియోని జూలై ఫస్ట్ వీక్ లో లాంచ్ చేయనున్నారు. మహేష్ శంకర్ సంగీతం అందించిన ఈ సినిమా పబ్లిసిటీ, కలర్ ఫుల్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా ఎలా ఉంటుందని జూలైలో తెలిసిపోతుంది.

తాజా వార్తలు