మనవడితో తాత సినిమా తీయనున్నాడా?

మనవడితో తాత సినిమా తీయనున్నాడా?

Published on Jun 30, 2013 6:50 PM IST

Ramanaidu-Naga-Chaitanya
తాత నిర్మాతగా మనవడితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఈ తాతా మనవలు ఎవరు అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.. అన్నీ అనుకున్నట్టు జరిగితే మూవీ మొఘల్ డా డి రామానాయుడు ఆయన మనవడు అక్కినేని నాగ చైతన్య హీరోగా ఓ సినిమా నిర్మించనున్నాడు. ఇటీవలే ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంజాబీ ఫిల్మ్ ‘సింగ్ వర్సెస్ కౌర్’ సినిమాని నాగ చైతన్యతో రీమేక్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. ముందుగా ఈ సినిమా రీమేక్ వెర్షన్లో నటించడానికి ముందుగా రానా దగ్గుబాటిని అనుకున్నారు, కానీ రానా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. అనుకోకుండా నాగ చైతన్య ఈ సినిమా చూసి ఉండడం, అలాగే ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఉన్నాడు. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈ సినిమా టీం కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య విక్రం కుమార్ మనం’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తి కాగానే శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ‘హలో బ్రదర్’ రీమే సెట్స్ లోకి అడుగుపెడతాడు.

తాజా వార్తలు