ఆ వార్తల్లో నిజం లేదన్న రాజమౌళి

ఆ వార్తల్లో నిజం లేదన్న రాజమౌళి

Published on Jun 30, 2013 11:45 AM IST

Rajamouli
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న సినిమా ‘బాహుబలి’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 6 నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రభాస్, రానా, అనుష్కలు కత్తి యుద్ధం, గుర్రపు సవారీలు నేర్చుకుంటున్న సంగతి మనకు తెలిసిందే, తాజాగా రానా గురపు స్వారీ చేస్తూ ఉండగా కింద పడితే తీవ్ర గాయాలయ్యాయని మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై స్పందించిన రాజమౌళి ఆ వార్తల్ని కొట్టి పారేశారు.

‘ రానాకి చాలా చిన్న చిన్న గాయాలయ్యాయి. అయినప్పటికీ మేము సేఫ్టీ కోసం హాస్పిటల్ లో చెక్ చేయించాం. రానా తలకి పెద్ద దెబ్బ తగిలింది అని వస్తున్నా వార్తలు నమ్మకండి. అనవసరంగా దుష్ప్రచారం చేసి రానా ఫ్యామిలీకి, అభిమానులు బాధపడేలా చేయకండని’ రాజమౌళి ట్వీట్ చేసాడు.

తాజా వార్తలు