శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘అనామిక’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. తెలుగు తమిళ భాషల్లో విడుదలకాబోతున్న ఈ సినిమాలో నయనతార ముఖ్య భూమికను పోషిస్తుంది. వైభవ్ రెడ్డి ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ ‘అనామిక’ సినిమా హిందీలో విజయం సాదించిన ‘కహాని’ సినిమాకు రీమేక్. ఈ సినిమాను ఎండెమోల్ ఇండియా, లొంగ్లిన్ ప్రొడక్షన్స్ మరియు సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జూలై చివరకల్లా పూర్తవుతుంది. ఇప్పటివరకు 36రోజుల చిత్రీకరణ జరిపిన ఈ సినిమాను మరో 3వారాలలో ముగిస్తామని దర్శకుడు నమ్మకంగా చెప్తున్నాడు.
గతంలో శేఖర్ తీసిన సినిమాలు చాలా సమయం తీసుకున్న కారణాన ఈ సినిమా షూటింగ్ ఒక రికార్డు అనే చెప్పాలి. ఈ కధను తెలుగు, తమిళ నేపధ్యాలకు ఇమడ్చడానికి శేఖర్ కమ్ములతో పాటు యండమూరి వీరెంధ్రనాద్ కలిసి పనిచేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సి.విజయ్ కుమార్ సినిమాటోగ్రాఫర్. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు