జూలై 6న విడుదలకానున్న ‘లవ్ టు లవ్’

జూలై 6న విడుదలకానున్న ‘లవ్ టు లవ్’

Published on Jun 29, 2013 11:05 AM IST

Love-To-Love-(2012)-Telugu

తమిళ నటుడు ఆర్య హీరోగా నటించిన సినిమా ‘లవ్ టు లవ్’. ఈ సినిమాని జూలై 6న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మణికంఠన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మనదేశం మూవీస్ బ్యానర్ పై వల్లభనేని అశోక్ కుమార్ నిర్మించాడు. ఈ సినిమాలో ఆర్య సరసన శ్రీయ, ప్రీతికారావులు హీరోయిన్స్ గా నటించారు. హరిహరన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఆర్య ద్విపాత్రబినయం చేయనున్నాడు. ప్రేమ కథ నేపద్యంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి కమర్షియల్ హంగులతో నిర్మించామని ఈ సినిమా నిర్వాహకులు తెలియజేశారు.

తాజా వార్తలు