సేదతీరడానికి ఇంగ్లాండ్ వెళ్లనున్న కాజల్

సేదతీరడానికి ఇంగ్లాండ్ వెళ్లనున్న కాజల్

Published on Jun 29, 2013 10:10 AM IST

Kajal-Agarwal

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తాను నటిస్తున్న రెండు ద్విభాషా సినిమాల షూటింగ్ల నడుమ బిజీగా వుంది. ‘ఆల్ ఇన్ అజాఘు రాజ’ మరియు ‘జిల్లా’ సినిమాలలో ఆమె కనిపించనుంది. ‘జిల్లా’ సినిమాలో ఆమె విజయ్ సరసన కనిపిస్తుండగా, మరో సినిమాలో కార్తి సరసన నటిస్తిస్తుంది. ప్రస్తుతం కార్తి సినిమాలో ఒక పాటలో పాల్గున్న ఆమె తన సినిమాపై ఎంతో ఉత్సాహంగా వుంది. వీరిద్దరు ఇప్పటికే ‘నా పేరు శివ’ సినిమాలో కలిసి నటించారు.ప్రస్థుథమ్ కాజల్ కుటుంబం ఇంగ్లాండ్ లో సెలవులకు వెళ్ళారు. త్వరలో ఆమె కూడా వారితో కలవనుందని తెలిపింది. “వింబుల్డన్ లో నా కుటుంబం !!! అక్కడ పసందైన రుచులను ఆస్వాదిస్తున్నారు 🙂 వారిని వదిలి ఉండలేకపోతున్నాను” అని తన అధికారికి పేజిలో తెలిపింది. ‘బాద్ షా’ తరువాత తెలుగులో మరో సినిమా అంగీకరించడానికి చాలా ఆలోచనలు చేస్తుంది. కొన్ని పెద్ద ప్రాజెక్ట్లు ఆమెను ఇప్పటికే పలకరించాయి.

తాజా వార్తలు