మాస్ మహారాజ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘బలుపు’ రేపు విడుదలకానుంది. ఈ సినిమాపై నిర్వాహకులు భారీ అంచనాలతో ఉన్నారు. అలాగే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదిస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో రవితేజ మాస్ లుక్, శృతి హసన్ గ్లామర్, బ్రహ్మానందం కామెడీ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయని సమాచారం. గత కొద్ది రోజులుగా మంచి హిట్ లేకుండా ఉన్న రవితేజ ఈ సినిమాతో మళ్లీ ఫౌంలోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో గడ్డం లుక్, పంచ్ డైలాగ్స్ రవితేజకి మంచి పేరుకు తీసుకోస్తాయని అందరు బావిస్తున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి సెకండ్ హీరోయిన్ గా ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించనుందని సమాచారం. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా పాటలకు మంచి ప్రేక్షకాదారణ లబించింది. ఈ సినిమాని పీవీపీ సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు.