కోయంబత్తూర్ లో నాని సినిమా షూటింగ్

కోయంబత్తూర్ లో నాని సినిమా షూటింగ్

Published on Jun 27, 2013 12:10 AM IST

Jenda-Pai-Kapiraju
నాని తాజా సినిమా ‘జండా పై కపిరాజు’ సినిమా షూటింగ్ ముగింపుదశలో వుంది. ఇటీవలే కొన్ని సన్నివేశాలను బెంగుళూరులో తెరకెక్కించారు. ప్రస్తుతం కోయంబత్తూర్ లో కైమాక్స్ సన్నివేశాలను తీస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒక పాత్రలో గుండుతో కనబడనున్నాడు. వాసన్ విజువల్ వెంచర్స్ బ్యానర్ పై కె.ఎస్ శ్రీనివాసన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సముధ్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. అమలా పాల్ హీరోయిన్. జి.వి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నాడు. నువ్వు మారితే నీ చుట్టూ వున్నా సమాజం కుడా మారుతుందన్న నేపధ్యమే ఈ సినిమా కధ. కృష్ణ వంశీ ‘పైసా’ మరియు ‘బాండ్ భజా భారత్’ సినిమా రీమేక్ లో కుడా నానిని మనం త్వరలో చూడొచ్చు.

తాజా వార్తలు