అజిత్, విష్ణు వర్ధన్ ల సినిమాలో షూటింగ్ ముగించుకున్న రానా

అజిత్, విష్ణు వర్ధన్ ల సినిమాలో షూటింగ్ ముగించుకున్న రానా

Published on Jun 25, 2013 11:50 PM IST

Rana-Daggubati
‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా దగ్గరనుండి గతకొన్ని నెలలుగా రానా ఆసక్తికర నిర్ణయాలను తీసుకుంటున్నాడు. ‘యే జవాని యే దివానీ’ సినిమాలో తళుక్కున మెరిసిన రానా ఇప్పుడు అజిత్, నయనతార, తాప్సీ మరియు ఆర్య నటిస్తున్న సినిమాలో మెరవనున్నాడు. ఈ సినిమాను ‘పంజా’ సినిమా దర్శకుడు విష్ణువర్ధన్ తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ఈస్ట్ కోస్ట్ రోడ్ దగ్గర జరుగుతుంది. దాదాపు రానా భాగపు చిత్రీకరణ మొత్తం ముగిసింది. “అజిత్ – విష్ణువర్ధన్ ల తమిళ సినిమాలో నా ఆఖరి రోజులు. చిన్న పాత్రైనా చిరస్మరణీయ పాత్ర. ఇక్కడ సెట్ వాతావరణాన్ని మిస్ అవ్వనున్నాను” అని ట్వీట్ చేసాడు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఈ ఏడాది మొదట్లో ముంబైలో తీసారు. మిగిలిన షూటింగ్ చెన్నైలో ముగిస్తున్నారు. ఈ సినిమాలోనే కాక రానా ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ సినిమాలలో నటిస్తున్నాడు

తాజా వార్తలు