ఈ నెలాఖరున చరణ్ ‘ఎవడు’ ఆడియో

ఈ నెలాఖరున చరణ్ ‘ఎవడు’ ఆడియో

Published on Jun 25, 2013 2:07 PM IST

Yevadu-Posters

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఆడియో ఈ నెలాఖరున అనగా జూన్ 30న విడుదలకు సిద్దమవుతోంది. ఈ వార్తని రామ్ చరణ్ పి.ఆర్.ఓ ఖరారు చేసారు. ‘ఎవడు’ సినిమాకి ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే ప్రొడక్షన్ టీం ఈ సినిమాని జూలై చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో చరణ్ శ్రుతి హాసన్, అమీ జాక్సన్ లతో ఆడిపాడుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో ఓ అతిధి పాత్రలో కనిపించనుండడం వల్ల మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు