‘ఈ రోజుల్లో’ చిత్రాన్ని నిర్మించిన సంస్థ నుండి వస్తున్న మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘రొమాన్స్’. ప్రిన్స్ హీరోగా నటించిన ఈ సినిమా ఆడియో ని జూన్ 29న రిలీజ్ చేయనున్నారు. ఆ విశేషాలను తెలియజేయడం కోసం ఈ రోజు ‘రొమాన్స్’ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఈ చిత్ర నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ ‘ ఈ రోజుల్లో లాంటి ట్రెండ్ సెట్టర్ తర్వాత సినిమా చెయ్యాలనుకున్నప్పుడు స్వామి గారు కథ చెప్పగానే నచ్చింది. అలాగే మారుతి గారికి కూడా సింగల్ సిట్టింగ్ లోనే కథ నచ్చింది. ఈ నెల 29న ఓ అగ్ర హీరోల చేతులమీదుగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ చేస్తాం. పెద్ద టెక్నీషియన్స్ తీసిన చిన్న సినిమా ‘రొమాన్స్’. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో బాబా సెహగల్ టైటిల్ సాంగ్ ని పాడారని’ అన్నాడు.
డైరెక్టర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ ‘ ప్రేమ మొదలైన తర్వాత పెళ్ళికి ముందు ఉండే ప్రేమలో కేవలం కోరికే కాదు ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి వాటినే ఈ సినిమాలో చూపించాను. ఇందులో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. ప్రస్తుతం యువత ఎలా మాట్లాడుకుంటుందో అలానే ఈ సినిమాలో డైలాగ్స్ ఉంటాయి. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మారుతి, ఎస్.కె.ఎన్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని నిర్మించినదుకు వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని’ అన్నాడు.
మారుతి మాట్లాడుతూ ‘ నేను డైరెక్టర్ కాక ముందు నుంచి స్వామి తో మంచి రిలేషన్ ఉంది. ఈ సినిమాతో రైటర్ గా 100% సక్సెస్ అవుతారు, అలాగే డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ సినిమాలో అందరూ తెలుగమ్మాయిలే నటించారు. చెప్పాలంటే ఈ సినిమాలో అమ్మాయిలే హీరోలని’ అన్నాడు