అల్లరోడి 3డి యాక్షన్ కి మంచి ఓపెనింగ్స్

అల్లరోడి 3డి యాక్షన్ కి మంచి ఓపెనింగ్స్

Published on Jun 23, 2013 12:20 PM IST

Action 3D (5)
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘యాక్షన్ 3డి’ సినిమా గత శుక్రవారం విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ఇండియాలో మొట్ట మొదటి సారిగా తెరకెక్కించిన 3డి మూవీ అని చెప్పడంతో ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు ఎక్కువగా ఉండటం, దానికి తోడు అల్లరి నరేష్ ఫ్యాన్స్ కూడా తోడవడంతో ఓపెనింగ్స్ బాగున్నాయి.

ఈ సినిమా రాష్ట్రం మొత్తం మీద 3డి, 2డి వెర్షన్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి అనిల్ సుంకర నిర్మాణ బాధ్యతలు చేపట్టడమే కాకుండా దర్శకత్వం కూడా చేసారు. అల్లరి నరేష్ తో పాటు రాజు సుందరం, వైభవ్, కిక్ శ్యాం హీరోలుగా నటించిన ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్, నీలం ఉపాధ్యాయ్ మెయిన్ హీరోయిన్స్ గా నటించారు. బప్పి – బప్పా లహరి సంగీతం అందించిన ఈ సినిమాకి సర్వేశ్ మురారి సినిమాటోగ్రాఫర్. కీత్ డ్రైవర్ 3డి ఎఫెక్ట్స్ చేసారు.

తాజా వార్తలు