కొత్త డేట్ వచ్చాక ‘అఖండ 2’ సంచలనం.. ఫాస్టెస్ట్ రికార్డులు

కొత్త డేట్ వచ్చాక ‘అఖండ 2’ సంచలనం.. ఫాస్టెస్ట్ రికార్డులు

Published on Dec 10, 2025 1:19 PM IST

akhanda2 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం (Akhanda 2). ఆల్రెడీ గత వారమే సినిమా రిలీజ్ కి రావాల్సి ఉంది కానీ ఆ డేట్ నుంచి ఇప్పుడు కొత్త డేట్ లోకి ఈ సినిమా వాయిదా పాడిని. అయితే ఈ కొత్త డేట్ అనౌన్స్ చేయడంతోనే రికార్డులు ఈ సినిమా స్టార్ట్ చేసింది. మెయిన్ గా యూఎస్ మార్కెట్ లో అఖండ 2 సిసలైన తాండవం చూపిస్తుంది.

వసూళ్ళలో ఫాస్టెస్ట్ రికార్డులు..

ఇది వరకు పలు సినిమాలు బుకింగ్స్ ఓపెన్ అయ్యిన ఇంత సమయానికి భారీ మొత్తంలో ప్రీమియర్స్ ఇంకా ప్రీ సేల్స్ గ్రాస్ ను అందుకున్నాయి అనే టాక్ వినే ఉంటాం. అలాగే అఖండ 2 కి కొత్త డేట్ వచ్చాక బుకింగ్స్ ఓపెన్ చేయగా ఫాస్టెస్ట్ లక్ష నుంచి లక్షా 25 వేల డాలర్స్ గ్రాస్ ని టచ్ చేసిన సినిమాగా ఇది నిలిచింది.

టికెట్స్ లో కూడా..

అఖండ 2 (Akhanda 2) కి బుకింగ్స్ ఓపెన్ అయ్యిన 6 గంటల్లోనే 7200 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. దీనితో అఖండ 2 కి ఉన్న మాస్ రెస్పాన్స్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ 12న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు