సూపర్ స్టార్ రజినీకాంత్ తన కుటుంబం మొత్తంతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ అలా కనిపించినప్పుడల్లా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అభిమానులను అలరిస్తోంది.
ప్రస్తుతం రజినీకాంత్ గోవాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక క్యూట్ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు.
ఈ వైరల్ ఫోటోలో తలైవర్ చాలా సింపుల్ క్యాజువల్ లుక్‌లో, తన సతీమణి లతా రజినీకాంత్ పక్కన స్టైలిష్‌గా నిలబడి ఉన్నారు. వీరితో పాటు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య మరియు రజినీకాంత్ మనవళ్లు కూడా ఉండటంతో, మూడు తరాల కుటుంబం ఒకే దగ్గర చేరినట్లయింది. అందరూ చిరునవ్వులతో ఫోటోకు ఫోజులివ్వడం విశేషం.
షూటింగ్స్ బిజీలో ఉండే రజినీకాంత్, ఇలా మనవళ్లతో, కూతుళ్లతో రిలాక్స్ అవుతూ కనిపించడం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.


