ఎట్టకేలకు భాగ్యశ్రీ భాగ్యం పండిందా..?

ఎట్టకేలకు భాగ్యశ్రీ భాగ్యం పండిందా..?

Published on Nov 28, 2025 12:01 AM IST

Bhagyashri 1

టాలీవుడ్‌లో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సేకు ఇప్పటివరకు పెద్ద హిట్ దక్కలేదు. తొలి సినిమాతో పాటు కింగ్డమ్, కాంత సినిమాలు కూడా ఫెయిల్యూర్ కావడంతో ఆమె తన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’పై బోలెడు ఆశలు పెట్టుకుంది. మంచి బజ్‌తో రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్, మంచి రివ్యూలు, పెరిగిన ఆక్యుపెన్సీలు చూసి చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాలో రామ్ నటన, కథలోని భావోద్వేగం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో భాగ్యశ్రీని సాదాసీదా ఫ్యామిలీ గర్ల్‌గా చూపించారు. రామ్‌తో ఉన్న లిప్‌లాక్‌ తప్ప ఇబ్బందికరమైన సన్నివేశాలు లేవు. నటన పరంగా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది భాగ్యశ్రీ.

నేడు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. మరి భాగ్యశ్రీకి ఈ సినిమాతో సక్సెస్ అందుతుందా లేదా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు