‘స్పిరిట్’లో జాయిన్ అయిన ప్రభాస్.. ఇక నాన్-స్టాప్!

‘స్పిరిట్’లో జాయిన్ అయిన ప్రభాస్.. ఇక నాన్-స్టాప్!

Published on Nov 27, 2025 9:01 PM IST

Spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఆయన తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో ప్రభాస్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వరకు ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. న్యూ ఇయర్ తర్వాత, వచ్చే ఏడాది ప్రారంభంలో మెక్సికోలో నెక్స్ట్ షెడ్యూల్ జరగనుంది.

ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్ ఓబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు