స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలో ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను తాజాగా లాంచ్ చేశారు.
‘భీమవరం బల్మా’ అంటూ సాగే ఈ పాటకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ పాటతో నవీన్ తొలిసారి ప్లే బ్యాక్ సింగ్‌గా మారాడు. ఇక ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్, మిక్కీ జే మేయర్ క్యాచీ ట్యూన్స్ తోడవడంతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నవీన్ సరసన అందాల భామ మీనాక్షి చౌదరి మంచి మాస్ స్టెప్పులు వేస్తూ సందడి చేస్తోంది.
ఇక ఈ సినిమాను మారి డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2026 జనవరి 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.


