అన్నగారు వస్తారు.. అనిల్ రావిపూడి లాంచ్ చేస్తారు..!

అన్నగారు వస్తారు.. అనిల్ రావిపూడి లాంచ్ చేస్తారు..!

Published on Nov 27, 2025 6:00 PM IST

Annagaru-Vostaru

తమిళ హీరో కార్తి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వా వాతియర్’ ఇప్పటికే తమిళంలో మాంచి క్రేజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు నలన్ కుమారసామి డైరెక్ట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లాంచ్‌ను ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఎక్స్ వేదికగా అనిల్ రావిపూడి ‘అన్నగారు వస్తారు’ చిత్ర టీజర్‌ను నవంబర్ 28న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో కార్తి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు