చాన్నాళ్ళకి హిట్ టాక్ తో 100 కోట్లు క్రాస్ చేసిన రకుల్ సినిమా!

చాన్నాళ్ళకి హిట్ టాక్ తో 100 కోట్లు క్రాస్ చేసిన రకుల్ సినిమా!

Published on Nov 25, 2025 7:02 PM IST

De De Pyaar De 2 Review

ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బిజీ స్టార్ హీరోయిన్ గా గడిపిన హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. అయితే అలా నెమ్మదిగా రకుల్ స్టార్డం అండ్ హిట్స్ కూడా తెలుగులో తగ్గిపోయాయి. తమిళ్ లో అరకొర సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా రాణించాలేదు. ఇలా చాలా కాలం స్ట్రగుల్ తర్వాత ఫైనల్ గా ఓ సినిమా హిట్ టాక్ తో 100 కోట్లు క్రాస్ అయ్యి తన కెరీర్ ని కొంచెం గాడిన పెట్టింది.

మరి ఆ చిత్రమే తాను హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే 2’. నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ ఇంట్రెస్టింగ్ రోమ్ కామ్ చిత్రం హిందీలో విడుదల అయ్యి రెండు వారాలు అయ్యింది. అయితే ఈ రెండు వారాలు సక్సెస్ ఫుల్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా 100 కోట్ల క్లబ్ లో చేరింది. మంచి టాక్ రావడంతో హిందీ జనం స్టడీ వసూళ్లు ఈ సినిమాకి అందించారు. ఇలా భారతీయుడు 2 ప్లాప్ కాకుండా హిట్ టాక్ తో ఈసారి రకుల్ 100 కోట్ల సినిమా చాలా ఏళ్ల తర్వాత అందుకుంది.

తాజా వార్తలు