సోషల్ మీడియాలో ‘పెద్ది’ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్!

సోషల్ మీడియాలో ‘పెద్ది’ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్!

Published on Nov 23, 2025 3:01 PM IST

peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి వచ్చి బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది.

ఇక ఈ సాంగ్ వచ్చిన మొదటి రోజు నుంచి సోషల్ మీడియాలో అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తుంది అని చెప్పాలి. లోకల్ నుంచి గ్లోబల్ లెవెల్ వరకు సోషల్ మీడియాలో పెద్ది సాంగ్ మేనియానే ఉంది. ఇక ఇలా ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లలో కలిపి ఏకంగా హాఫ్ మిలియన్ రీల్స్ ఈ సాంగ్ పై చేశారట.

దీనితో ఆఫ్ లైన్ లో ఈ సాంగ్ ఆడియెన్స్ కి ఎంతలా ఎక్కేసిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇదంతా ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

తాజా వార్తలు