మన ఇండియన్ ఓటీటీ కంటెంట్ నుంచి వచ్చిన పలు సూపర్ హిట్ కంటెంట్ లలో అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వచ్చిన వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయ్. ఇక వాటిలో నటుడు మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్రలో దర్శకులు రాజ్ అండ్ డీకేలు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి.
మరి ఈ సిరీస్ లో మూడో సీజన్ ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. పాన్ ఇండియా భాషల్లో మొత్తం 7 ఎపిసోడ్స్, యావరేజ్ గా 53 నిమిషాల నిడివితో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ చూడాలి అనుకునేవారు నేటి నుంచి ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.


