అఫీషియల్: ‘అఖండ 2’ ట్రైలర్ డేట్ వచ్చేసింది.. బాలయ్య కోసం శివన్న

అఫీషియల్: ‘అఖండ 2’ ట్రైలర్ డేట్ వచ్చేసింది.. బాలయ్య కోసం శివన్న

Published on Nov 19, 2025 6:02 PM IST

నందమూరి మాస్ గాడ్ బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం అఖండ 2 కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ట్రైలర్ కోసం ఇవాళే మేము కొన్ని అంశాలు రివీల్ చేసాము. ఇక లేటెస్ట్ గా మేకర్స్ కూడా సినిమా ట్రైలర్ డేట్ ని ఇచ్చేసారు.

ఈ నవంబర్ 21న ట్రైలర్ ని లాంచ్ చేస్తుండగా మేము చెప్పిట్టుగానే చింతామణి ప్రాంతం వేదికగా సాయంత్రం 6 గంటల నుంచి ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. అలాగే ఈవెంట్ కి మేకర్స్ కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ ముఖ్య అతిధిగా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో బాలయ్య, శివ రాజ్ కుమార్ ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దర్శకుడు థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తుండగా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు