‘వారణాసి’ నుండి ‘రణ కుంభ’ ఆడియో సాంగ్ రిలీజ్

‘వారణాసి’ నుండి ‘రణ కుంభ’ ఆడియో సాంగ్ రిలీజ్

Published on Nov 18, 2025 11:07 PM IST

SSMB29 Prithviraj Sukumaran

టాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌ను రాజమౌళి తనదైన రీతిలో నిర్వహించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఈ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన చాలా విషయాలను ప్రేక్షకులకు అందించారు. ఇదే ఈవెంట్‌లో ‘కుంభ’ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీని ఓ పాట రూపంలో ప్రజెంట్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ పాటను ఆడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశారు.

‘రణ కుంభ’ అంటూ సాగే ఈ పాట ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా రుద్ర పాత్రలో మహేష్ తాండవం చేసేందుకు రెడీ అయ్యాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2027 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు