క్రికెట్ ప్రపంచంలోకి ఓ కొత్త సంచలనం దూసుకొచ్చాడు. అతనే 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద సిక్స్‌లు కొట్టడం చూసి అంతర్జాతీయ క్రికెటర్లే ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఒమన్ టీమ్ (Oman Team) ప్లేయర్స్ వైభవ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో వైభవ్ తన ఫియర్‌లెస్ పవర్ హిట్టింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. యూఏఈ (UAE)తో జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన బ్యాటింగ్ ప్రదర్శన చూసి అందరూ అవాక్కయ్యారు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ (Century) చేసి, అప్పటికప్పుడు రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 42 బంతులు ఆడిన వైభవ్, ఏకంగా 144 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు (Fours) ఉంటే, 15 భారీ సిక్స్‌లు ఉన్నాయంటే అతనెంత వేగంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు పాకిస్తాన్-ఎ (Pakistan-A) జట్టుతో తలపడిన మ్యాచ్‌లో కూడా వైభవ్ 28 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. కేవలం రెండు మ్యాచ్‌లలోనే 189 పరుగులు చేసి, ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఈ రోజు (నవంబర్ 18) భారత్-ఎ, ఒమన్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో, ఒమన్ జట్టులోని ఆర్యన్ బిస్త్, సమయ్ శ్రీవాత్సవ వంటి క్రికెటర్లు… వైభవ్‌ను మొదటిసారి దగ్గరగా చూడబోతున్నందుకు చాలా ఎగ్జైటెడ్‌గా (Excited) ఉన్నామని చెప్పారు.
ఒమన్ క్రికెటర్ ఆర్యన్ బిస్త్ మాట్లాడుతూ, “మేము ఇంతకు ముందు వైభవ్ సూర్యవంశీని టీవీలో మాత్రమే చూశాం. 14 ఏళ్ల వయసులో బంతిని అంత దూరం బాదడం మామూలు విషయం కాదు. కానీ వైభవ్‌కు ఇది మినహాయింపు. అతను చాలా అద్భుతంగా, సులభంగా సిక్స్‌లు కొడుతున్నాడు” అని ప్రశంసించాడు. లెగ్ స్పిన్నర్ సమయ్ శ్రీవాత్సవ కూడా, వైభవ్‌ను కలిసి మాట్లాడాలని, క్రికెట్‌పై అతని ఆలోచనా విధానం ఎలా ఉందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు.
ముఖ్యంగా, యూఏఈపై వైభవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఒక అరుదైన రికార్డును కూడా నెలకొల్పింది. టీ20 ఫార్మాట్‌లో టీమ్ ఇండియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఉర్విల్ పటేల్ (28 బంతులు), అభిషేక్ శర్మ (28 బంతులు) తర్వాత, కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేసి రిషభ్ పంత్ (Rishabh Pant) రికార్డును వైభవ్ సమం చేశాడు. ఈ చిన్న వయసులోనే వైభవ్ సాధిస్తున్న ఈ విజయాలు భవిష్యత్తులో అతను పెద్ద స్టార్‌గా ఎదుగుతాడని సూచిస్తున్నాయి.


